బాలీవుడ్ స్టార్, విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే రెండు రోజుల క్రితం(ఆదివారం) ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం మృతిచెందిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఇర్ఫాన్ ముంబైలో ఉండటం వల్ల జైపూర్‌లో తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేక యాడు. ఆ సమయంలో ఇర్ఫాన్ అనారోగ్యానికి గురవడం కూడా తల్లి అంత్యక్రియలకు వెళ్లకపోవడం ఓకారణం. వీడియో కాల్ ద్వారా జైపూర్‌లోని తల్లి అంతక్రియలు ఆయన పాల్గొన్నారు. తల్లి మరణం కారణంగా ఆందోళన చెందుతున్న ఇర్ఫాన్ మరింత అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. (‘అప్పుడే పదో తరగతి పరీక్షల నిర్వహణ’ )
ముంబై ఆసుపత్రిలో చేరిన నటుడు ఇర్ఫాన్