పదేళ్ల తర్వాత మళ్లీ ఆ డైరెక్టర్‌తో మహేష్‌ సినిమా!

ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో సెలబ్రిటీలంతా ఇళ్లలోనే ఉంటూ కొత్త ప్రాజెక్టులపై కసరత్తు ప్రారంభించారు. షూటింగ్‌లో ఉన్న సినిమాలు నిలిచిపోవడంతో భవిష్యత్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ హీరో, ఏ డైరెక్టర్‌తో ఏ సినిమా చేయనున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో పదేళ్ల క్రితం ఖలేజా సినిమా విడుదలయ్యింది. 2010లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో అప్పటి నుంచి వీరిద్దరు కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. కాగా గతేడాది మాత్రం ఇద్దరు ఓ ప్రకటన కోసం కలిసి పనిచేశారు. (యూట్యూబ్‌ ఛానల్‌ ఆదాయమంతా దానికే: రకుల్‌ )